జైలు నుంచి విడుదలైన అసాంజే
రహస్యపత్రాల లీక్ ఆరోపణలు ఐదేళ్లుగా బ్రిటిష్ జైలులోనే ఆరోపణల స్వీకరించడంతో విడుదలకు మార్గం సుగమం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే బ్రిటిష్ జైలు నుంచి మంగళవారం విడుదలయ్యాడు. తిరిగి తన స్వదేశం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడు. 52 ఏళ్ల అసాంజే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలకు సంబంధించిన యూఎస్ రహస్య పత్రాలను లీక్ చేశాడనే ఆరోపణలపై ఆయన బ్రిటిష్ జైలులో శిక్షను అనుభవించాడు. అయితే ఈ కేసులో అసాంజేకు ఐదు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ఆయన జైలులో ఐదు సంవత్సరాల రెండు నెలలపాటు జైలు శిక్షను అనుభవించడం వల్ల అసాంజేను విడుదల చేశారు. అమెరికా చేసిన ఆరోపణలను స్వీకరించేందుకు అసాంజే ఒప్పుకున్నారు. దీంతో ఆయన బెయిల్ కు మార్గం సుగమమైంది. అయితే అసాంజే అమెరికా, ఆస్ట్రేలియాకు చేరుకుంటారా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.