సమసిపోయిన ఎయిర్ ఇండియా ఉద్యోగుల సమస్య
విధుల్లోకి హాజరు మంగళవారం నుంచి యథావిధిగా విమాన సేవలు ప్రకటించిన సంస్థ అధికారులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎయిర్ ఇండియా ఉద్యోగుల సమస్య తొలగిపోయింది. ఆదివారం నుంచి ఉద్యోగులు విధులకు హాజరవుతున్నట్లు పేర్కొంది. కాగా ఉద్యోగులు, సంస్థ మధ్య జరిగిన చర్చలేంటివనేది వెల్లడించకపోవడం గమనార్హం. మరోవైపు ఆదివారం కూడా 20 విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. మంగళవారం నుంచి అన్ని విమాన సర్వీసులను యథావిధిగా నడపనున్నట్లు పేర్కొంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.