మహా సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయి
All major welfare schemes will continue
అసెంబ్లీలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
ముంబాయి: రాష్ట్ర ప్రభుత్వ పరిధి, కేంద్రం కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని మహారాష్ర్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. గురువారం మహారాష్ట్ర అసెంబ్లీలో పథకాలపై స్పష్టతనిచ్చారు. లడ్కీ, బహెన్ తోపాటు పథకాలన్నీ కొనసాగిస్తామన్నారు. డిసెంబర్ లో ఆర్థిక సాయం నిధులు జమ చేస్తామన్నారు. అసెంబ్లీలో విపక్షాల తీరుపై మండిపడ్డారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపీకే మద్ధతిచ్చారని గుర్తుంచుకోవాలన్నారు. ఏదిపడితే అది మాట్లాడినంత మాత్రాన అసత్యాలు వాస్తవాలు కావన్నారు. మహావికాస్ అఘాడి (ఎంవీఎ) నాయకులు గురువారం నాగ్ పూర్ లో సంవిధాన్ చౌక్ నుంచి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ నిరసనపై ఫడ్నవీస్ మాట్లాడుతూ.. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ కు గౌరవం ఇచ్చిందెవరో దేశ ప్రజలకు తెలుసన్నారు. రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న విపక్ష పార్టీల నిరసనలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు.