ట్రంప్ పై దాడికి యత్నం
నిందితున్ని అరెస్ట్ చేసిన సీక్రెట్ సర్వీస్ ఏకె–47, కెమెరా లభ్యం
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పై మరోమారు దాడికి యత్నం జరిగింది. ఫ్లోరిడాలోని పామ్ చీచ్ కౌంటిలో గోల్ఫ్ క్లబ్ లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా నిందితుడు పొదల్లో దాగి ఉండగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఏకె–47, ఓ కెమెరా లభించింది. ట్రంప్ పై దాడికి పాల్పడే వ్యక్తి 300 నుంచి 500 మీటర్ల దూరంలో ఉండగా భద్రతాధికారులు గమనించి అతనిపై కాల్పులు జరిపారు. వెంటనే నిందితుడు తన కారులో పారిపోయాడు. కారును వెంబడించిన అధికారులు 60 కిలోమీటర్ల దూరంలో అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు ఎవరు? ఎందుకు ట్రంప్ పై దాడికి యత్నించాడు? తదితర వివరాలు వెలుగులోకి రాలేదు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జూలై 13న కూడా ట్రంప్ పై పెన్సిల్వేనియాలో కాల్పులు జరిగాయి. చెవికి గాయమైంది.