యథేచ్ఛగా అక్రమ బియ్యం, నల్లబెల్లం దందా

Illicit rice and black-bellied danda at will

Jun 25, 2024 - 20:19
 0
యథేచ్ఛగా అక్రమ బియ్యం, నల్లబెల్లం దందా
  • చిత్తూరు టూ మరిపెడకు నల్ల బెల్లం
  • మరిపెడ టూ ఆంధ్రకు రేషన్ బియ్యం
  • రాత్రివేళల్లో తండాలకు తరలింపు
  • చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
  • పైపై దాడులే.. అసలు సూత్రధారులపై కొరవడిన నిఘా

నా తెలంగాణ, డోర్నకల్​: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారింది.పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యం దళారులకు  వరంగా మారుతోంది. రేషన్ డీలర్లతో అధికారులు కుమ్మక్కు అవ్వడంతో డీలర్లు ప్రజల నుంచి రూ. 5కు కొనుగోలు చేసి రూ. 25కు అమ్మకొని సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ బియ్యాన్ని ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తూ అక్రమదందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మరిపెడ నుంచి వయా కురవి అక్కడి నుంచి ఖమ్మం మీదుగా ఆంధ్రా ప్రాంతానికి పెద్ద ఎత్తున లారీల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తూ దందా కొనసాగిస్తున్నారు. గుడుంబాను నిర్మూలిస్తునామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ చిత్తూరు నుంచి టన్నుల కొద్దీ నల్ల బెల్లం తండాలకు, పల్లెలకు రాత్రి వేళల్లో రవాణా జరుగుతుంది. సంబంధిత అధికారులు మాత్రం అమాయక గిరిజన ప్రజలపై కేసులు పెడుతూ టన్నుల కొద్దీ నల్ల బెల్లాన్ని ఈ ప్రాంతానికి తీసుకొస్తున్న అసలు దొంగలను కాపాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు సంబంధిత విషయంపై దృష్టి సారించాలని  అక్రమ వ్యాపారాలకు అడ్డు కట్ట వేసేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.