డిజిటల్ సర్వేకు సర్వం సిద్ధం
మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
నా తెలంగాణ, మెదక్: జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే నిర్వహించడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుంచి డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే ఉద్దేశించి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ప్రతి కుటుంబానికి డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వేను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేపడతామన్నారు. సర్వే కోసం 11 బృందాలు, ఒక్కో బృందంలో నలుగురు చొప్పున అధికారులు ఉంటారని తెలిపారు. నర్సాపూర్ గొల్లపల్లి, హనుమాన్ వీధిలలో సర్వే ప్రారంభిస్తామన్నారు. డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వేకు వచ్చిన అధికారులకు ప్రజలు సహకరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.