బుల్లెట్​ పేలితే గొయ్యితీసి పాతేస్తాం

If the bullet explodes, we dig it up and bury it

Sep 22, 2024 - 13:52
 0
బుల్లెట్​ పేలితే గొయ్యితీసి పాతేస్తాం
నౌషేరాలో కేంద్రమంత్రి అమిత్​ షా
370ని ఫరూక్​ ముత్తాతలూ తేలేరు!
ఉగ్రవాదాన్ని తేవాలనుకుంటున్న కాంగ్రెస్​
రవీంద్ర రైనాకు ఓటువేసి అభివృద్ధిని సుగమం చేసుకోవాలి
శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ లో కాంగ్రెస్​ మళ్లీ ఉగ్రవాదాన్ని తేవాలనుకుంటోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. ఫరూక్​ అబ్దుల్లా ముత్తాతలు కూడా ఆర్టికల్​ 370ని తిరిగి తీసుకురాలేరని షా మండిపడ్డారు. మోదీ నేతృత్వంలో బుల్లెట్​ పేలితో గొయ్యితీసి పాతేస్తామని హెచ్చరించారు. ఆదివారం నౌషేరాలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రవీంద్ర రైనాకు మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. ఫరూక్​ 370 తిరిగి తీసుకొస్తామని చెబుతున్నారని అన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా నిర్మూలిస్తామని షా హెచ్చరించారు. గతంలో ఎక్కడ బుల్లెట్ల వర్షం కురిపించేదో, ఈరోజు ఇక్కడ శాంతి నెలకొని ఉంది. ఎవరైనా కాల్పులు జరిపినా వారి తూటాలకు గుళ్లతో బదులిస్తాం. ఇదంతా మన ప్రధాని నరేంద్ర మోదీ వల్లే జరిగింది. నేడు రాళ్లు రువ్వినవారు, ఉగ్రవాదులు అందరూ జైళ్లలోనే ఉన్నారు. మళ్లీ విజృంభించాలని చూస్తే గొయ్యి తీసి పాతిపెడతామన్నారు. 
 
శంకరాచార్య పర్వతం, హరి పర్వతాల పేర్లను ఫరూక్​ అబ్దుల్లా మార్చాలనుకుంటున్నారని షా చెప్పారు. కానీ బీజేపీ ఉండగా ఆ పనిచేయనీయమని చెప్పారు. కాంగ్రెస్​, ఎన్సీలు ఇక్కడి పహారీలకు రిజర్వేషన్లు ముందు ఇవ్వలేదు, ఇకముందు కూడా ఇవ్వరన్నారు. కానీ మోదీ నేతృత్వంలో తాము రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 
 
రవీంద్ర రైనా కేవలం చేతల మనిషి కాదని చెప్పిన దానిని సమర్థవంతంగా నిర్వహించే మంచి నాయకుడని అన్నారు. ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి ఆయనను గెలిపించాలని షా విజ్ఞప్తి చేశారు. అప్పుడే జమ్మూకశ్మీర్​, నౌషేరా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లగమన్నారు.