సెల్జా చేరతామంటే ఆహ్వానిస్తాం
హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ దళిత నేతలను అవమానిస్తున్న కాంగ్రెస్
చండీగఢ్: కుమారి సెల్జా చేసిన తప్పేంటని ఆమె అత్యుత్తమ ప్రజాసేవకురాలుగా తాము భావిస్తున్నామని ఆమె బీజేపీలో చేరతానంటే సంతోషంగా ఆహ్వానిస్తామని హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కాంగ్రెస్ లో గత కొద్దికాలంగా అంతర్గత విభేదాల నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు కుమారి సెల్జాపై సొంతనేతలే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం పట్ల తీవ్ర మనస్థాపంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వేరే పార్టీలో చేరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం భూపేంద్ర సింగ్ హుడాతో సెల్జాకుమారికి విబేధాలు పొడసూపాయి. కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకి అని వారిని గౌరవించదని అన్నారు. దళిత నాయకులు మరోమారు ఆలోచించుకోవాలని మోదీ నేతృత్వంలో దళిత నాయకులకు అత్యున్నత గౌరవం, మర్యాదలు బీజేపీలో లభిస్తాయని తెలిపారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే కుటుంబపార్టీ, బంధుప్రీతి పార్టీలో ఇరుక్కున్నట్లేనని సైనీ స్పష్టం చేశారు.