విమానాలకు వరుస బెదిరింపులు రూ. 200 కోట్లు నష్టం

A series of threats to flights cost Rs. 200 crore loss

Oct 22, 2024 - 13:18
 0
విమానాలకు వరుస బెదిరింపులు రూ. 200 కోట్లు నష్టం
బెదిరింపుల నిందితులు ఇక జైలుకే పరిమితం?
విమానాలను పేల్చివేస్తామని ఖలిస్థానీ ఉగ్రవాది హెచ్చరిక
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలోని విమానాలకు బాంబు హెచ్చరికల పరంపర కొనసాగుతోంది. గత వారం రోజులుగా వస్తున్న బాంబు హెచ్చరికతో రూ. 200కోట్లకు పైగా విమానయాన సంస్థలకు నష్టం వాటిల్లింది. సోమవారం అర్థరాత్రి 30 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు మంగళవారం ఉదయం పలు విమాన సంస్థలకు చెందిన అధికారులు తెలిపారు. బెదిరింపులు వచ్చిన వాటిలో ఎయిర్​ ఇండియా, ఇండిగో, విస్తారా వంటి సంస్థలున్నాయి. తాము అన్ని విమానాల్లో ప్రోటోకాల్​ ను పాటించామన్నారు. మరోవైపు నకిలీ బెదిరింపులపై కేంద్ర విమానాయన మంత్రిత్వ శాఖ సీరియస్​ గా వ్యవహరించాలని నిర్ణయించింది. బెదిరింపులకు పాల్పడేవారిని ఇక జైలుకే పరిమితం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు ఖలిస్థానీ ఉగ్రవాద నాయకుడు గురుపత్వంత్​ సింగ్​ పన్నూ కూడా విమానాలను పేల్చివేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదే ఉగ్రసంస్థ 1984లో ఓ విమానాన్ని పేల్చివేసి 349మంది మృతికి కారణమయ్యారు. 
 
బెదిరింపుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలను చేపట్టింది.
– విమానాల్లో మార్షల్స్​ సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. నకిలీ బెదిరింపులపై హోంమంత్రిత్వ శాఖ నుంచి నివేదిక కోరింది. ఎన్ఐఏ, ఐబీలను కూడా నివేదికలు సమర్పించాలని కోరింది.
 
–  బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) అన్ని ఎయిర్‌లైన్స్ సీఈఓలతో అక్టోబర్ 19న సమావేశం నిర్వహించింది.  బెదిరింపులపైనే ప్రధానంగా చర్చించారు. ప్రయాణికులకు అసౌకర్యం, విమానయాన సంస్థలకు కలిగే నష్టంపై కూడా చర్చలు జరిగాయి. 
 
–  అక్టోబరు 19న కేంద్రం డీజీసీఏ చీఫ్‌ విక్రమ్‌ దేవ్‌దత్‌ను ఆ పదవి నుంచి తప్పించి, బొగ్గు మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా చేసింది. విమానయాన శాఖలో వరుస బెదిరింపులతో చర్యలకు ఉపక్రమించింది. 
 
– ముంబై, కొచ్చిలో ఇద్దరు, ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో ఒక మైనర్‌ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.