కేటీఆర్​ క్షమాపణలు చెప్పకుంటే ఆందోళన ఉధృతం

ఆదిలాబాద్​ మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు ఆశమ్మ

Oct 3, 2024 - 18:34
 0
కేటీఆర్​ క్షమాపణలు చెప్పకుంటే ఆందోళన ఉధృతం

నా తెలంగాణ, ఆదిలాబాద్: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్​ అనుచిత వ్యాఖ్యలకు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదిలాబాద్​ మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ డిమాండ్​ చేశారు. గురువారం కంది శ్రీనివాస్​ రెడ్డి క్యాంపు కార్యాలయ ఆవరణలో పెద్ద యెత్తున కాంగ్రెస్​ శ్రేణులో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మను దహనం చేశారు. కళ్యాణ లక్ష్మిపై కేటీఆర్​ అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మ‌హిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సోనియా, ష‌బానా, జుబేదా, ఖ‌మ‌ర్  బేగం, అఫ్రోజా కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు గిమ్మ సంతోష్,  పట్టణ అధ్యక్షుడు గుడిప‌ల్లి న‌గేష్, జైన‌థ్ మార్కెట్ క‌మిటీ చైర్మన్​ అల్లూరి అశోక్ రెడ్డి, కౌన్సిల‌ర్లు క‌లాల శ్రీ‌నివాస్, జ‌ఫ‌ర్ అహ్మద్​, లోక ప్రవీణ్​ రెడ్డి, పోరెడ్డి కిష‌న్, డి. రాజశేఖర్​, ఖ‌య్యూం, సోమ ప్రశాంత్, రమేష్, మంచాల మల్లయ్య, సమీర్ అహ్మద్, సంతోష్, ఖలీల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.