స్పీకర్​ ఎన్నిక అభినందనల వెల్లువ

The election of the Speaker is a flood of congratulations

Jun 26, 2024 - 14:14
 0
స్పీకర్​ ఎన్నిక అభినందనల వెల్లువ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: స్పీకర్​ ఎన్నికపై పార్టీలకతీతంగా అభినందనలు తెలిపారు. బుధవారం నూతన పార్లమెంట్​ భవనంలో 18వ లోక్​ సభ స్పీకర్​ గా రెండోసారి ఎన్నికై ఓం బిర్లా చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా స్పీకర్​ ఓం బిర్లాకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

రాహుల్​ గాంధీ..

స్పీకర్​ గా ఎన్నికైన ఓం బిర్లాకు తన సీటుపై ఆసీనులను చేసేందుకు రాహుల్​ గాంధీ వెంట వెళ్లారు. ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షాల గొంతుకకు కూడా అవకాశం ఇస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సభ దేశ ప్రజల గొంతుక అన్నారు. ప్రభుత్వానికి అధికారం ఉన్నా, తాము ప్రతిపక్షంలో ఉన్నా మా స్వరాన్ని కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసేందుకు స్పీకర్​ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

అఖిలేష్​ యాదవ్​..

రెండోసారి స్పీకర్​ పదవి బాధ్యతను చేపట్టినందుకు అఖిలేష్​ యాదవ్​ ఓం బిర్లాకు శుభాకాంక్షలు తెలిపారు. సభా కార్యక్రమాల నిర్వహణ బాధ్యత నియంత్రణే గాక అందరు సభ్యులను నియంత్రణలో పెట్టే అతిపెద్ద బాధ్యత కూడా మీపైనే ఉంటుందన్నారు. అందుకు విరుద్ధంగా చర్యలు తీసుకోబోరని ఆశిస్తున్నట్లు తెలిపారు.

హర్​ సిమ్రత్​ కౌర్​..

చిన్న పార్టీలకు కూడా పార్లమెంట్​ లో సమస్యలను విన్నవించేందుకు పూర్తి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద పార్టీలకు ఇచ్చినంత అవకాశాన్ని తమకు కూడా ఇవ్వాలన్నారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకు తమకు ఇంతకుముందు కంటే ఎక్కువ అవకాశాన్ని కల్పించాలని హర్​ సిమ్రత్​ కౌర్​ శిరోమణి అకాలీదళ్​ ఎంపీ కోరారు. రెండోసారి స్పీకర్​ గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు.

చిరాగ్​ పాశ్వాన్​..

17వ లోక్​ సభలో అనేక అవకాశాలిచ్చారు. 18వ లోక్​ సభలో కూడా ప్రజాసమస్యల పరిష్​కారానికి మరిన్ని అవకాశాలిస్తారని భావిస్తున్నాం. ఎన్నికలు ముగిసిపోయాయి. బలాబలాలు తేలిపోయాయి. తమ తమ ప్రాంతాల అభివృద్ధిపై ఎంపీలంతా దృషి సారించి సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఓం బిర్లా ఎన్నికైనందున సంతోషంగా ఉందన్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

సుప్రియా సూలే..

సుప్రియా సూలే మాట్లాడుతూ కోవిడ్ సమయంలో స్పీకర్​ చేసిన పని అభినందనీయమన్నారు. ఐదేళ్లలో ఆయన పనితీరు చాలా బాగుందని కితాబిచ్చారు. అదే సమయంలో 150 మంది సభ్యుల సస్పెన్షన్​ బాధించిందన్నారు. మరోసారి అలాంటి నిర్ణయాలు ఉండబోవని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏది ఏమైనా రెండోసారి స్పీకర్​ గా ఓం బిర్లా ఎన్నికపై సుప్రియా సూలే అభినందనలు తెలిపారు.