ఐడీఎఫ్​ బాంబుదాడులు.. 45మంది మృతి

IDF bombings.. 45 people died

Nov 2, 2024 - 13:11
 0
ఐడీఎఫ్​ బాంబుదాడులు.. 45మంది మృతి

గాజా స్ట్రిప్: లెబనాన్ గ్రామాలపై ఇజ్రాయెల్ సైన్యం భారీ బాంబులతో విరుచుకుపడింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ జరిపిన ఈ దాడుల్లో 45 మంది మరణించినట్లు ఆ ప్రాంత గవర్నర్​ బషీర్​ ఖోద్ర్ తెలిపారు. ఈశాన్య ప్రాంతంలోని 9 గ్రామాలపై వైమానికదాడులు జరిగాయన్నారు. ఆయా గ్రామాల్లో హిజ్బుల్లా ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో దాడులు చేసినట్లు ఐడీఎఫ్​ పేర్కొంది. దక్షిణ శివారు దహియాలో హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. ఐడీఎఫ్​ చేస్తున్న వరుస దాడులతో 60వేలమంది లెబనీయులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. చాలామంది ఇంకా తమ ప్రాంతాన్ని వదులుకోలేక అక్కడే ఉన్నారు.