హిజ్బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్​ బీకర దాడులు

IDF attacks on Hezbollah bases

Oct 3, 2024 - 19:52
 0
హిజ్బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్​ బీకర దాడులు
60మంది మృతి, 50 శాతం ఆయుధ సంపత్తి నష్టం
దాడుల్లో హమాస్​ చీఫ్​ రావి, ఇద్దరు కమాండర్ల మృతి
రాకెట్​ దాడులను సమర్థంగా అడ్డుకుంటున్నాం
ఇరాన్​ అణు కేంద్రాలపై దాడులకు ఐడీఎఫ్​ సిద్ధం
స్విట్జర్లాండ్​ గా పేరొందిన లెబనాన్​ లో తీవ్ర విధ్వంసం
మస్నా సరిహద్దులో హిజ్బొల్లాకు ఇరాన్​ ఆయుధాల అందజేత
ఇజ్రాయెల్​ ఆరోపణలు
జెరూసలెం: లెబనాన్​ పై ఇజ్రాయెల్​ విరుచుకుపడుతోంది. బుధవారం అర్థరాత్రి నుంచి కొనసాగుతున్న దాడులు గురువారం కూడా కంటిన్యూ చేస్తోంది. భారీ ఎత్తున హిజ్బొల్లా స్థావరాలను ధ్వంసం చేస్తోంది. ఇప్పటికే 50 శాతం హిజ్బొల్లా ఆయుధ సంపత్తిని నష్టం చేశామని ఐడీఎఫ్​ స్పష్టం చేసింది. స్థావరాలపై దాడులతో 60 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని పేర్కొంది.  హమాస్ చీఫ్ రావి ముష్తాహా, కమాండర్లు సమేహ్ అల్-సిరాజ్, సమీ ఔదేహ్‌లు మరణించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 
 
మరోవైపు హిజ్బొల్లా 200 రాకెట్లతో ఇజ్రాయెల్​ పై దాడి చేసింది. వీటిని సమర్థంగా అడ్డుకున్నామని ఐడీఎఫ్​ ప్రకటించింది. ఇజ్రాయెల్​ ఇరాన్​ అణు కేంద్రాలపై దాడికి ప్రణాళికలు రచించి సిద్ధంగా ఉందన్న సమాచారం అందడంతో ఇరాన్​ హెచ్చరికలు జారీ చేసింది. అలా చేస్తే అదే ఇజ్రాయెల్​ కు చివరి రోజు కాగలదని హెచ్చరించింది. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్​ నేరుగా దాడులు చేయడం సరికాదని అంటూనే క్లిష్టపరిస్థితుల్లో ఇజ్రాయెల్​ వెంట నడుస్తామన్నారు. 
 
ఇస్లామిక్​ స్విట్జర్లాండ్​ గా పేరు పొందిన లెబనాన్​ ఇజ్రాయెల్​ దాడులతో చాలాభాగం ధ్వంసమవుతోంది. ఇస్లామిక్​ దేశాలన్నీ లెబనాన్​ ను స్విట్జర్లాండ్​ గా వ్యవహరిస్తాయి. అంత ఆర్థికంగా పరిపూర్ణంగా లెబనాన్​ ఉంది. అదే సమయంలో హిజ్బొల్లాతో సత్సంబంధాల వల్ల లెబనాన్​ అప్రతిష్ఠనూ మూటగట్టుకుంది. 
 
లెబనాన్​ సిరియాల మధ్య ఉన్న మస్నా రహదారి ద్వారా ఇరాన్​ హిజ్బొల్లా ఉగ్రవాదులకు ఆయుధాలను అందజేస్తున్నట్లు ఇజ్రాయెల్​ ఆరోపించింది. ఈ దారిగుండా వేలాది వాహనాలు సిరియాకు చేరుకుంటున్నాయి. ఇదే సమయంలో ఇరాన్​ ఆయుధ సంపత్తిని లెబనాన్​ కు తరలిస్తున్నారని ఐడీఎఫ్​ గుర్తించింది. వీటితోనే హిజ్బొల్లా ఇజ్రాయెల్​ పై దాడులకు తెగబడుతోందని చెబుతోంది.