కాంగ్రెస్ కు మరో షాక్ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జంప్
హస్తం పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బుధవారం ఆ పార్టీకి ఇద్దరు నేతలు రాజీనామా ప్రకటించారు.
నా తెలంగాణ, న్యూఢిల్లీ: హస్తం పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బుధవారం ఆ పార్టీకి ఇద్దరు నేతలు రాజీనామా ప్రకటించారు. పార్టీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యేలు నీరజ్ బసోయా, నసీబ్ సింగ్ లు రాజీనామా చేశారు. ఆప్‌తో మా పొత్తును కొనసాగించడం అత్యంత అవమానకరమని, గత ఏడేళ్లలో ఆప్ అనేక కుంభకోణాలకు పాల్పడిందని వారు రాసిన లేఖలో పేర్కొన్నారు. దేవేంద్ర యాదవ్‌ను డీపీసీసీ చీఫ్‌గా నియమించడంపై నసీబ్ సింగ్ కినుకు వహించారు. పంజాబ్‌లో అరవింద్ కేజ్రీవాల్ తప్పుడు ఎజెండాపై దాడి చేసేందుకు ఏఐసీసీ (పంజాబ్ ఇన్‌ఛార్జ్)గా ఆయన ప్రచారాన్ని ప్రారంభించడాన్ని తప్పుబట్టారు. పార్టీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల పట్ల తీవ్ర మనస్తాపానికి, అవమానానికి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే నసీబ్ సింగ్ స్పష్టం చేశారు.