రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
A person died in a road accident
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: మందమర్రిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం బీమారం మండలం ఆరేపల్లికి చెందిన రాంటెంకి రాజేష్ (20), తన మిత్రుడు నాగరాజుతో కలిసి ద్విచక్ర వాహనంపై తాండూరు బోయపల్లి వెళ్లి తిరిగి వస్తున్నారని తెలిపారు. మందమర్రి అంగడి బజార్ కు రాగానే వెనుక నుంచి వస్తున్న ఆటో వీరి బైక్ ను ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో రాజేష్ కి తీవ్ర గాయాలయ్యాయని బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని ఎస్ ఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ రాజశేఖర్ వెల్లడించారు.