చివరిదశలో రఫా పోరాటం
లెబనీస్ సరిహద్దుకు ఐడీఎఫ్ ను పంపిస్తాం షరతులకు కట్టుబడి ఉంటేనే యుద్ధం ముగింపు స్పష్టం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
జేరూసలెం:రఫాలో పోరాటం చివరిదశలో ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. లెబనీస్ సరిహద్దుకు ఇజ్రాయెల్ బలగాలను పంపుతామని స్పష్టం చేశారు. హమాస్ ను అధికారం నుంచి గద్దె దించే వరకు యుద్ధం కొనసాగుతుందన్నారు. హమాస్ తో తమ ఒప్పందం షరతులతో కూడుకున్న ప్రకారమే ఉంటుందన్నారు. యుద్ధాన్ని ముగించడంతోపాటు తమ బందీలందరినీ సురక్షితంగా విడిచిపెట్టాలని నెతన్యాహు డిమాండ్ చేశారు. గాజా నుంచి హాస్ తరలివెళ్లాలన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ పై భారీ దాడులకు హిజ్బులా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలను కూడా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ దాడులను అడ్డుకుందుకు లెబనీస్ సరిహద్దులకు సైనికులను పంపించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.