పాక్​ లో పెరుగుతున్న పరువు హత్యలు

ఇద్దరు యువతులను చంపిన తండ్రి, అన్న ప్రభుత్వ చర్యలపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం

Jun 6, 2024 - 15:19
 0
పాక్​ లో పెరుగుతున్న పరువు హత్యలు

లాహోర్​:  పాక్​ లో మహిళల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. పరువు హత్యలు పెరుగుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న కోపంతో ఇద్దరు యువతులను సొంత కుటుంబ సభ్యులే హత్య చేసిన ఘటన గురువారం వెలుగులోకొచ్చింది. పంజాబ్​ ప్రావిన్స్​ వెహారిలో ఉంటున్న నిషాత్​, అప్సానా ఇద్దరు అక్కాచెల్లెళ్లు నెలక్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని వరుడి కుటుంబ సభ్యులు అంగీకరించినా యువతుల కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో పంచాయతీలోని పెద్దలు వీరి వివాహానికి అడ్డు తగలవద్దని యువతులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని తీర్పునిచ్చారు. మంగళవారం బాలికల తండ్రి సయీద్​, సోదరుడు ఆసీమ్​ లు మరికొందరితో కలిసి యువతులను చిత్రహింసలకు గురి చేసి కాల్చి చంపారు. దీంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అరెస్టు చేశారు. 

సగటున పాక్​ లో ప్రతీయేటా వెయ్యి మంది మహిళలు పరువు హత్యలకు గురవుతున్నారని పాక్​ హ్యూమన్​ రైట్స్​ చెబుతుండడం గమనార్హం. మరోవైపు వీటిపై చర్యలను మాత్రం ప్రభుత్వం తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.