వసతి గృహంలో దరఖాస్తులకు ఆహ్వానం

Applications are invited in the hostel

Jun 6, 2024 - 16:08
 0
వసతి గృహంలో దరఖాస్తులకు ఆహ్వానం

నా తెలంగాణ, డోర్నకల్: మరిపెడ పట్టణంలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఎడ్​, ఐటిఐ విద్యార్థులు ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహం మరిపెడలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. శుక్రవారం వసతి గృహ సంక్షేమ సంఘం అధికారిని కల్పన ప్రకటన విడుదల చేశారు. ప్రవేశాలతోపాటు స్కాలర్షిప్ కు అర్హులైన బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు నిష్పత్తి ద్వారా సీట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్రభుత్వ మెను ప్రకారం భోజన వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కల్పన కోరారు.