దేశ వైవిద్యానికి ప్రతీక హోలీ

శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Mar 25, 2024 - 15:18
 0
దేశ వైవిద్యానికి ప్రతీక హోలీ

నా తెలంగాణ, ఢిల్లీ: హోలీ రంగులు దేశ వైవిద్యానికి ప్రతీకలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు. హోలీ సందర్భంగా రాష్ట్రపతి సోమవారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. హోలీ ప్రజల ప్రేమ, ఐక్యత, సోదర భావాన్ని పెంపొందిస్తుందన్నారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. నూతనోత్సాహంతో దేశాభివృద్ధికి కృషి చేసేందుకు శక్తిని సమకూర్చుకోవాలని పిలుపునిచ్చారు.