బీజేపీకి ఓటేసిందని ట్రిపుల్​ తలాక్​!

మధ్యప్రదేశ్​ లో కేసు నమోదు

Jun 25, 2024 - 19:29
 0
బీజేపీకి ఓటేసిందని ట్రిపుల్​ తలాక్​!

భోపాల్​: బీజేపీకి ఓటు వేశానని ట్రిపుల్​ తలాక్​ ఇచ్చాడని ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్​ లోని చింద్వారాలో 26 ఏళ్ల యువతి 8ఏళ్ల క్రితం వివాహాం చేసుకుంది. అత్తగారింటిలో పొరపొచ్చాల వల్ల భర్తతో కలిసి వేరు కాపురం పెట్టింది. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిందని భర్తకు తెలిపింది. దీంతో అప్పటి నుంచి తనకు ఇబ్బందులు కలిగిస్తున్న భర్త ట్రిపుల్​ తలాక్​ చెప్పాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త తనకు ట్రిపుల్​ తలాక్​ చెప్పడంలో అత్తగారింటివారి ప్రమేయం కూడా ఉందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వరకట్న నిషేధ చట్టం భారత శిక్షాస్మృతిలోని నిబంధనల ప్రకారం మహిళ భర్త, అత్తగారు, నలుగురు కోడళ్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.