ఇస్రోకు ఐఎఎఫ్–2024 అవార్డు
చంద్రయాన్–3 సక్సెస్ లభించిన గౌరవం
మిలాన్: చంద్రయాన్–3 కి గాను భారత్ (ఇస్రో చీఫ్ సోమనాథ్)వరల్డ్ స్పేస్ అవార్డు–2024ను గెలుచుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో భారత చేసిన కృషికి గాను ఇటాలియన్ స్పే ఏజెన్సీ ఏరోనాటిక్స్ ఆస్ర్టోనాయికస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎయిరోస్పేస్ ఎరోనాటికల్ కాంగ్రెస్ –75 సదస్సులో ఈ వార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా డా. సోమనాథ్ మాట్లాడుతూ.. చంద్రయాన్ 1, 2 ద్వారా చేసిన ప్రయత్నాలతోనే చంద్రయాన్ –3ని సక్సెస్ చేయగలిగామన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న సమయంలో చంద్రయాన్–4కు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష రంగం సహకారంతో భారత్ అనుకున్న లక్ష్యాలను సాధిస్తుందన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. చంద్రునిలో మానవ మనుగడ కోసం నీటి జాడలు వెతికేందుకు చంద్రయాన్–4 మిషన్ కీలకం కానుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పరిశోధనలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ అవార్డును అందుకోవడం ఎంతో సంతోషకరమని ఐఎఎఫ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమవేశంలో దేశ విదేశాల నుంచి వ్యోమగాములు, శాస్ర్తవేత్తలు, అంతరిక్ష రంగ నిపుణులు 8వేల మంది పాల్గొన్నారు. భారత్ కు అవార్డు దక్కడం పట్ల వారంతా హర్షం వ్యక్తం చేశారు.