జంతువులను హింసిస్తే కఠిన చర్యలు

కుక్కల సంఖ్య తగ్గించడానికి ఏబీసీ చర్యలు చేపట్టాలి సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ 

Aug 16, 2024 - 18:23
Aug 16, 2024 - 18:25
 0
జంతువులను హింసిస్తే కఠిన చర్యలు

నా తెలంగాణ, సంగారెడ్డి: జంతువులను హింసిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టర్ రేట్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మూగజీవాల పట్ల ప్రేమగా ఉండాలని, కుక్కల సంఖ్య తగ్గించేందుకు ఏబీసీ చర్యలు చేపట్టాలన్నారు.

బయటకు వెళ్ళినప్పు వృద్ధులు, చిన్నారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

జంతువుల పట్ల క్రూర మనస్తత్వంతో హింసిస్తే చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో అక్కడక్కడ కుక్కల బెడద ఉన్నదని, వాటి సంఖ్యను తగ్గించడానికి బర్త్ కంట్రోల్ వంటి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. 

గ్రామీణ ప్రాంతాల్లో 43,751 కుక్కలు, మున్సిపాలిటీ పరిధిలో 17,770 కుక్కలను గుర్తించారు. వీటిని (ఏబీసీ) బర్త్ కంట్రోల్ కేంద్రాలకు తరలిస్తామన్నారు. ఇంట్లో చెత్తను మున్సిపాలిటీ వాహనాలలోనే వేయాలని, బయట పారేయని అలా చేస్తే కుక్కలు చెత్త వేయకూడదని అన్నారు. హోటల్, మాంసం వస్తువుల యాజమానులు వ్యర్థాలను రోడ్లు వేస్తే పక్కనే నోటీసులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. 

ఈ సమీక్ష సమావేశంలో పశుసంవర్ధక శాఖ జైంట్ డైరెక్టర్ వసంతకుమారి, డి ఐ ఓ. వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్స్ డాక్టర్ రవీందర్, డాక్టర్ ప్రభాకర్, నవోదయ వెట్ సొసైటీ సభ్యులు గిరి ఉన్నారు.