అనాధ పిల్లలతో ఆనందంగా..
హీరోయిన్ గా శ్రీలీల ఎంత బిజీగా ఉన్నా కూడా చిన్న పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేయడంతో పాటు, అనాధలతో టైమ్ స్పెండ్ చేయడం, మానసిక వికలాంగులతో టైమ్ స్పెండ్ చేయడం చేస్తూ ఉంటుంది.
హీరోయిన్ గా శ్రీలీల ఎంత బిజీగా ఉన్నా కూడా చిన్న పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేయడంతో పాటు, అనాధలతో టైమ్ స్పెండ్ చేయడం, మానసిక వికలాంగులతో టైమ్ స్పెండ్ చేయడం చేస్తూ ఉంటుంది. గతంలో సోషల్ మీడియాలో శ్రీలీల అలాంటి వీడియోలను షేర్ చేసింది. ఈసారి శ్రీలీల సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో క్యూట్ గా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. షూటింగ్ గ్యాప్ లో పిల్లలతో ఆకేసి పప్పేసి అంటూ ఆట ఆడుకుంది. ఈ వీడియోను ఇన్ స్టా లో షేర్ చేసిన శ్రీలీల మరింత క్యూట్ గా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా హీరోయిన్స్ షాట్ గ్యాప్ లో చాలా సీరియస్ గా పక్కన కూర్చుని ఫోన్ లో చూస్తూ ఉండటం లేదంటే రెస్ట్ తీసుకోవడం చేస్తారు. కానీ శ్రీలీల మాత్రం షూటింగ్ గ్యాప్ లో ఇలా పిల్లలతో చిల్ అవ్వడం నిజంగా సూపర్ గా అనిపిస్తుందని చాలా మంది సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసి తమ అభిప్రాయంను చెబుతున్నారు. ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే గుంటూరు కారం సినిమా నిరాశ పరచడంతో తదుపరి సినిమా విషయంలో మరింత శ్రద్ద కనబర్చుతున్నట్లుగా తెలుస్తోంది. ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కూడా శ్రీలీల తదుపరి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.