6న కేంద్రమంత్రితో భేటీ
బీజేపీ కిసాన్ మోర్చా ఇన్ చార్జీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
నా తెలంగాణ, హైదరాబాద్: హర్ ఘర్ తిరంగా, రాజకీయ, రైతాంగ సమస్యలు, రుణమాఫీ, నిరుద్యోగ, మహిళా సమస్యలపై తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డితో ఈ నెల 6వ తేదీన భేటీ అయి చర్చించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కిసాన్ మోర్చా ఇన్ చార్జీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం గుజ్జుల భేటీ విషయంపై ప్రకటన విడుదల చేశారు. 6వ తేదీన రాష్ర్ట బీజేపీ కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయా విషయాలపై కేంద్రమంత్రితో చర్చిస్తామన్నారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా అధ్యక్షులు పాల్గొంటారని గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు.