క్షిపణి ప్రయోగం విజయవంతం

మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ అభినందనలు

Sep 13, 2024 - 20:46
 0
క్షిపణి ప్రయోగం విజయవంతం

భువనేశ్వర్​: డీఆర్డీవో రూపొందించిన వీఎల్​ ఎస్​ఆర్​ఎస్​ఏఎ (వర్టికల్​ లాంచ్​ షార్ట్​ రేంజ్​ సర్ఫేస్​ టు ఎయిర్​ మిస్సైల్​)ను ఒడిశాలోని చాందీపూర్​ నుంచి పరీక్షించి విజయం సాధించింది. శుక్రవారం ఈ ప్రయోగం వివరాలను అధికారులు వివరించారు. ఈ క్షిపణి ఎంచుకున్న లక్ష్యాలను వందశాతం నిర్వీర్యం చేస్తాయన్నారు. గురువారం కూడా ఇదే క్షిపణిని ప్రయోగించి పలు లక్షాలను చేధించినట్లు తెలిపారు. శుక్రవారం ప్రయోగించిన క్షిపణి మరింత సమర్థవంతంగా లక్ష్యాలను చేధించిందన్నారు. నిరంతరం క్షిపణి ప్రయోగంతో దీని పనితీరుపై పూర్తి అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. క్షిపణి ప్రయోగం విజయవంతం అవడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ ప్రశంసలు కురిపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. క్షిపణి రూపకల్పన, పరీక్షల్లో పాల్గొన్న అధికారులను అభినందించారు.