ముల్లోకాలలో హస్తం అవినీతి

సోదరులను, దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర వీరి వల్లే భారత్​ ఉజ్వల భవిష్యత్తుకు ఆలస్యం మోదీ హయాంలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంతో ముందుకు ఎన్నికల సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ.నడ్డా

Apr 12, 2024 - 14:53
 0
ముల్లోకాలలో హస్తం అవినీతి

భోపాల్​: ముల్లోకాలను అవినీతికి ఉపయోగించిన పార్టీ కాంగ్రెస్​ అని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ. నడ్డా అన్నారు. అంతరిక్షాన్ని, భూమిని, పాతాళాన్ని కూడా వదలలేదని వాటిని కూడా అవినీతికి అనువుగా మలుచుకుందని నడ్డా మండిపడ్డారు. మధ్యప్రదేశ్​ లోని సిధి స్థానం బహ్రీ సిన్హావాల్​ లో ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం నడ్డా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్​ పై విమర్శల బాణాలను వదిలారు. 

ఈ సందర్భంగా నడ్ మాట్లాడుతూ కాంగ్రెస్​ పార్టీ ఇంతకుముందు ప్రజలను విభజించి రాజకీయాలు చేసిందన్నారు. కానీ నేడు సోదరులను కూడా విభజించి, దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలకు కాంగ్రెస్​ తెరలేపిందన్నారు. ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. కులం, మతాల పేరుతో హస్తం పార్టీ రాజకీయాలపై జేడీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గత ప్రభుత్వ హయాంలో సంపన్నదేశాల డాలర్​ దెబ్బకు రూపాయి విలువ అమాంతం పడిపోయిందన్నారు. పాలన వీరు చేస్తున్నా కళ్లెం సంపన్నదేశాల చేతికిచ్చిందని పేర్కొన్నారు. అందువల్లే ఉజ్వల భారత రూపకల్పనలో ఆలస్యం ఏర్పడిందన్నారు. 

కానీ 2014 తరువాత ప్రధాని మోదీ పగ్గాలు చేపట్టాక అన్ని నిర్ణయాల్లో కీలక మార్పులు చేశారన్నారు. దీని ద్వారా వస్తున్న ఫలితాలను ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. నిరుపేదలు, దళితులు, గిరిజనులు, దోపిడీకి గురైన వారి పట్ల మోదీ దార్శనికతతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. వారి సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళుతోందని స్పష్టం చేశారు. 2027 నాటికే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​ ను నిలపనున్నామని తెలిపారు. ఒక్క మధ్య ప్రదేశ్​ లోనే నల్​ సే జల్​ ద్వారా 55 లక్షల కుళాయి కనెక్షన్లను ఇచ్చామన్నారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల 30 లక్షల కనెక్షన్లను ఇచ్చామన్నారు. ఆయుష్మాన్​ భారత్​ కింద 55 కోట్ల మందికి ఉచిత వైద్య సౌకర్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఇవేగాక శాశ్వత నివాసాలు, గ్యాస్​, నారీశక్తి ద్వారా మహిళలకు ప్రోత్సాహం, రైతులు ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని జేపీ. నడ్డా స్పష్టం చేశారు.