ఘనంగా కాంగ్రెస్ నేత నూకల జన్మదిన వేడుకలు
Grand birthday celebrations of Congress leader Nukala
నా తెలంగాణ, డోర్నకల్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నూకల నరేష్ రెడ్డి జన్మదిన వేడుకలను మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. సోమవారం మండల ప్రెస్ క్లబ్ సభ్యులు నరేష్ రెడ్డికి శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పర్వతం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మారం అనంత రాములు, ఎలక్ట్రానిక్ మీడియా డోర్నకల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గండి విష్ణు, సీనియర్ రిపోర్టర్ దాసరోజు బాలకృష్ణ, గండి నాగరాజు, కారంపూడి వెంకటేశ్వర్లు, దేవరశెట్టి శ్రీశైలం, గంధసిరి ఉప్పలయ్య, ప్రవీణ్, రాంపల్లి కపిల్, చింత వెంకన్న, సురేశ్, రమేష్, బాశిపంగు సోమన్న తదితరులు పాల్గొన్నారు.