రైలు ప్రమాదంపై మోదీ సంతాపం
మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటన, రైల్వే శాఖ మృతులకు రూ. 10 లక్షలు, తీవ్రగాయాలైన వారికి రూ.2.50 లక్షలు నష్టపరిహారం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కంచన్ జంగా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల పట్ల విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులను తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యల్లో వేగం పెంచాలన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతిచెందిన వారికి రూ. 2 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50వేలు అందజేయనున్నట్లు తెలిపారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. రైల్వే శాఖ మృతులకు రూ. 10 లక్షలు, తీవ్రగాయాలైన వారికి రూ.2.50 లక్షలు నష్టపరిహారం అందజేస్తుందన్నారు. స్వల్ప గాయాలైన వారికి రూ. 50లు అందిస్తామన్నారు.
రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో వేగం పెంచేందుకు మంత్రి ప్రమాద స్థలానికి బయలుదేరారు. మరోవైపు రైల్వే శాఖ ప్రమాదంపై టోల్ ఫ్రీ నంబర్ విడుదల చేసింది.
భోగీల్లో మరికొంతమంది బాధితులు చిక్కుకోవడంతో వారిని బయటికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.