అయోధ్య రామాలయ ఏరియల్​ వ్యూకు ప్రభుత్వం సిద్ధం

ఒక్కరికి రూ. 4,130 ఏర్పాట్లలో ప్రభుత్వం

Dec 7, 2024 - 16:05
 0
అయోధ్య రామాలయ ఏరియల్​ వ్యూకు ప్రభుత్వం సిద్ధం

లక్నో: అయోధ్య రామ మందిర ఏరియల్​ వ్యూ సందర్శనకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమైంది. హెలికాప్టర్​ లో దర్శనానికి రూ. 4,130 ధర (ఒక్కొక్కరికి)గా నిర్ణయించింది. యూపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాకుంభ మేళాకు కూడా హెలికాప్టర్​ ద్వారా సందర్శించే సన్నాహాలను చేస్తుంది. అయితే ఇంకా అధికారికంగా యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించలేదు. అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి పనులు జూన్​ 2025 నాటికి పూర్తి కానున్నాయని ప్రభుత్వం ప్రకటించినా, మరో మూడు నెలలు అదనపు సమయం పట్టొచ్చని రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్​ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. సెప్టెంబర్​ 2025 నాటికి రామాలయ సంపూర్ణ నిర్మాణం పనులు పూర్తవుతాయన్నారు.