సైనికులకు ప్రధాని సెల్యూట్​

సాయుధ దళాల పతాక దినోత్సవం ప్రధాని మోదీ నివాళులు

Dec 7, 2024 - 16:20
Dec 7, 2024 - 16:26
 0
సైనికులకు ప్రధాని సెల్యూట్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సాహసోపేతమై సైనికుల పరాక్రమం, త్యాగాలకు ప్రధాని నరేంద్ర మోదీ సెల్యూట్​ చేశారు. శనివారం సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా వారి ధైర్య సాహసాలను, త్యాగాలను కీర్తించారు. పతాక దినోత్సవ నిధికి ప్రజలు సహకరించాలని ప్రధాని కోరారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ అమర సైనికులకు నివాళులర్పించారు. సైనికుల ధైర్యం, పరాక్రమం, త్యాగాలకు కొనియాడుతూ నివాళులర్పించారు. దేశం మొత్తం వారి త్యాగాలను,ధైర్య సాహసాలను గుర్తు చేసుకునే రోజన్నారు. వారి దయవల్లే ఈ రోజు భారత్​ క్షేమంగా ఉందన్నారు. సరిహద్దులో వారి ధైర్య సాహసాలను కీర్తించారు. సరిహద్దు భద్రతలో సైనికులకు సాటి లేరన్నారు. 1949 నుంచి  అమరవీరులు, సైనికులను గౌరవించటానికి డిసెంబర్ 7వ తేదీని సాయుధ దళాల పతాక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి నివాళులు..
దేశ సరిహద్దులను రక్షించడంలో, దేశ గౌరవాన్ని నిలబెట్టడంలో ముందువరుసలో ఉన్నవారే సైనికులని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా ప్రాణత్యాగం చేసిన జవాన్లకు నివాళులర్పించారు. యూనిఫామ్​ లో ఉన్న ధైర్యవంతులు దేశ సైనికులన్నారు. వారి సంక్షేమం కోసం దేశ ప్రజలు ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. వీరోచిత పోరాటలతో ప్రాణాలర్పించిన అనేక మంది జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు.