స్థైర్యాన్ని పెంచారు చరిత్ర సృష్టించారు

ఓం బిర్లా సేవలను కొనియాడిన ప్రధాని రెండోసారి ఎన్నిక.. స్పీకర్​ కు ప్రధాని మోదీ అభినందన

Jun 26, 2024 - 13:36
 0
స్థైర్యాన్ని పెంచారు చరిత్ర సృష్టించారు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రెండోసారి 18వ లోక్​ సభకు ఎన్నికై స్పీకర్​ ఓం బిర్లా చరిత్ర సృష్టించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మీ నేతృత్వంలోని 17వ లోక్​ సభలో అనేక కఠిన నిర్ణయాలను సైతం అవలీలగా తీసుకునే స్థైర్యాన్ని కల్పించారని ఓంబిర్లా సేవలను కొనియాడారు. 18వ లోక్​ సభను సవ్యంగా నడిపేందుకు, దేశ కీర్తి ప్రతిష్ఠలను మరింత పెంచేందుకు మరిన్ని సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకునేందుకు స్పీకర్​ ప్రోత్సాహం అవసరమని మోదీ అన్నారు. 

మూజువాణితో విజయం..

బుధవారం రెండోసారి లోక్​ సభ స్పీకర్​ పదవిపై మూజువాణి ఓటింగ్​ లో ఓం బిర్లా స్పీకర్​ గా విజయం సాధించారు. 

క్లిష్ట సమయాల్లోనూ సభకు మర్గనిర్దేశం..

ఎంపికైన అనంతరం స్పీకర్​ ను ప్రధాని మోదీ అభినందించి సభలో మాట్లాడారు. ఓం బిర్లా వరుసగా రెండోసారి స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించడాన్ని ప్రధాని స్వాగతించారు.తన ఐదేళ్ల అనుభవం, అతనితో సభ్యుల అనుభవం క్లిష్ట సమయాల్లో సభకు మార్గనిర్దేశం చేసేందుకు తిరిగి ఎన్నికైన స్పీకర్ సేవలను ప్రధాని అభినందించారు. స్పీకర్​ ఓం బిర్లా మర్యాదపూర్వక వ్యక్తిత్వాన్ని ఆయన సభ నిర్వహణ తీరును అభినందించారు. అదే సమయంలో ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ప్రతీ సభ్యునికి సహాయపడుతూ తన మోముపై చిరునవ్వును ఏనాడు దూరం కానీయలేదని కొనియాడారు. 

కోటాలో ప్రజాసేవ..

స్పీకర్​ 18వ లోక్​ సభలో ఎన్నికతో మరెన్నో విజయాలను సాధించేందుకు తమకు మార్గనిర్దేశం చేయాలని మోదీ విజ్ఞప్తి చేశారు. 17వ లోక్​ సభను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ఓంబిర్లాకే దక్కిందన్నారు. ఓంబిర్లా తన స్వంత నియోజకవర్గమైన కోటాలో ప్రజలకు సేవ చేసే విధానాన్ని మోదీ సభ్యులకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఆరోగ్య సేవలను దరి చేర్చారని కొనియాడారు. స్పీకర్​ క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ యువతలో నూతనోత్సాహాన్ని నింపారని కొనియాడారు. 

17వ లోక్​ సభ స్వర్ణకాలం..

17వ లోక్​ సభ స్వర్ణకాలంగా పేర్కొన్నారు. నారీ శక్తి వందన్, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ, భారతీయ న్యాయ సంహిత, భారతీయుల రక్షణ, సామాజిక సురక్ష, వ్యక్తిగత డేటా రక్షణ, ముస్లిం మహిళా వివాహ చట్టం, లింగమార్పిడి వ్యక్తుల హక్కుల రక్షణ లాంటి బిల్లులను ఈ లోక్​ సభలో విజయవంతంగా ప్రవేశపెట్టి విజయం సాధించేందుకు స్పీకర్​ ఓం బిర్లా ప్రోత్సాహం మరువలేనిదని మోదీ తెలిపారు. ఆయన 17వ లోక్​ సభలో ఈ బిల్లులన్నీ చరిత్రలో నూతనాధ్యాయాన్ని లిఖించబోతున్నాయని అన్నారు.

అమృతకాల భవిష్యత్​ కు మార్గం సుగమం..

స్పీకర్ మార్గదర్శకత్వంలో నూతన పార్లమెంట్ భవనం అమృత్ కాల భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుందని మోదీ తెలిపారు. ప్రస్తుత స్పీకర్ అధ్యక్షతనే నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అయ్యిందన్న విషయాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల పునాదులను బలోపేతం చేసే దిశగా స్పీకర్​ తీసుకున్న చర్యలను మోదీ ప్రశంసించారు. 

ప్రజాస్వామ్య పునాదులు మరింత బలోపేతం..

పార్లమెంటు భవనం కేవలం గోడలు కాదని, 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలకు కేంద్రమని ప్రధాని అన్నారు. ఇంటి పనితీరు, ప్రవర్తన, జవాబుదారీతనం మన దేశంలో ప్రజాస్వామ్య పునాదులను మరింతగా పెంచుతాయని మోదీ తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో సభ సభ్యుల పట్ల స్పీకర్ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలను అనేక సత్ఫలితాలనిచ్చాయని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఉత్పాదకత కూడా 170 శాతం పెంచడంలో స్పీకర్​ పాత్ర ఉందని అన్నారు. 

కఠిన నిర్ణయాల్లో సమతూకం..

కఠిన నిర్ణయాల్లో కూడా సమతూకం పాటించారని మోదీ కొనియాడారు. ఓం బిర్లా సంప్రదాయాలు, సభా విలువలను మరింత పెంచాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. 18వ లోక్​ సభ నిర్వహణ, వ్యవహారాల్లో స్పీకర్​ ఓం బిర్లా విజయవంతం అవుతారని తమకు పూర్తి విశ్వాసం, నమ్మకాలు ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. స్పీకర్​ మార్గదర్శకంలో దేశాన్ని నూతన శిక్షరాలకు తీసుకెళ్లేందుకు సభా సభ్యులందరూ స్పీకర్​ ఓం బిర్లాకు సహకరించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.