ఆలయంలో ఆవు తలలు దుండగుల ఇళ్లపై బుల్డోజర్
Bulldozer on houses of bullies with cow heads in the temple
భోపాల్: మధ్యప్రదేశ్ లోని రత్లాం జగన్నాథ ఆలయ సముదాయంలో ఇద్దరు దుండగులు ఆవు తలలు విసిరేసి పారిపోయారు. ఈ ఘటనను ఆలయ పూజారి శుక్రవారం ఉదయం గుడికి వచ్చాక చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగాయి. ఆవుతలలు ఆలయంలో విసిరిన వారు జకీర్, షకీర్ లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుల ఇళ్లను బుల్‌డోజర్ తో కూల్చివేసింది. నిందితులకు వత్తాసు పలికేందుకు ముస్లిం వర్గాలు అధికారులను బెదిరింపులకు గురి చేసేందుకు చుట్టుముట్టారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ దుండగుల ఇళ్లను కూల్చివేశారు.
నిందితులు గురువారం అర్థరాత్రి ఆలయంలోకి ఆవు తలలు విసిరినట్లుగా తమ విచారణలో తేలిందని ఎస్పీ రాకేశ్ కాఖా తెలిపారు.