చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ 8మంది నక్సల్స్ మృతి
ఒక జవాను వీరమరణం, మరో ఇద్దరికి గాయాలు మృతుల సంఖ్య పెరిగే అవకాశం దట్టమైన అటవీలో కొనసాగుతున్న కూంబింగ్
రాయ్ పూర్: చత్తీస్ గఢ్ అబూజ్ మడ్ కుతుల్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 8మంది నక్సలైట్లు మృతిచెందారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శనివారం కుతుల్, ఫర్సాబెడ, కొడమెట ప్రాంతాల్లో పెద్ద యెత్తున నక్సల్స్ సమవేశం అవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బస్తర్ డివిజన్ జగదల్ పూర్, దంతేవాడ, కొండగావ్, కంకేర్ నుంచి 1400మంది డీఆర్జీ,ఎస్టీఎఫ్ బలగాను ఆ ప్రాంతానికి చేరుకొని కూంబింగ్ చేపట్టాయి. నక్సలైట్ల స్థావరాలను చుట్టుముట్టి లొంగిపోవాల్సిందిగా కోరినా వారు పట్టించుకోకుండా కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. సైనికులు దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లి కూంబింగ్ చేపట్టారు. అయితే కాల్పుల్లో ఒక జాను మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ యేడాది జనవరి నుంచి 161 రోజుల్లో జరిగిన కాల్పుల్లో 141 మంది నక్సల్స్ ఎన్ కౌంటర్ లో మృతిచెందారు.
హతమైన నక్సలైట్ల మృతదేహాలతో పాటు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన నక్సలైట్లలో ఒకరు డీవీసీఎం క్యాడర్‌కు చెందిన కంపెనీ కమాండర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇతనిపై ఇప్పటికే రూ. 8 లక్షల రివార్డును ప్రకటించారు.