అదనపు నిధుల కోసం కోర్టుకెక్కిన కేరళ

అధికారులు చర్చించుకోవాలన్న సుప్రీం

Mar 6, 2024 - 17:21
 0
అదనపు నిధుల కోసం కోర్టుకెక్కిన కేరళ

నా తెలంగాణ, న్యూఢిల్లీ: కేరళ, కేంద్రం మధ్య నిధుల కేటాయింపు అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీం న్యాయమూర్తి సూర్యకాంత్​ సూచించారు. ఆర్థిక వివాదాలపై ఇరువురు అధికారులు కూర్చొని చర్చించుకోవాలని చర్చల ఫలితాలను బట్టి మళ్లీ సుప్రీంను ఆశ్రయించొచ్చని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కేరళకు నిధులు కేటాయించడం లేదని ఆ రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేసింది. బుధవారం ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీం న్యాయమూర్తి సూర్యకాంత్​ కేసు విచారణపై మాట్లాడుతూ.. భారతదేశ ఆర్థిక వృద్ధి వాస్తవాలు, గణాంకాల్లో పెరుగుదల చోటు చేసుకుంటున్నదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రగతి సాధిస్తున్న దేశంగా భారత్​ కీర్తించబడుతున్నది. ఈ పరిణామం భారతీయులందరికీ గర్వకారణం. భారత్ ​కు ఆర్థిక ప్రగతిలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్న వేళ తమకు నిధులు కేటాయిండం లేదంటూ కేరళ కోర్టుకెక్కడం కన్నా చర్చలు జరపడం ఉత్తమమన్నారు. బుదవారం సాయంత్రం ఐదు గంటలకు కేరళ ప్రభుత్వం, కేంద్ర ఉన్నతాధికారులు నిధులపై చర్చించుకోవాలని సూచించారు.  కేరళ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణకు రూ.13 వేల కోట్లు, అదనంగా రూ.15వేల కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ డబ్బు వివిధ రకాల పన్నుల రూపంలో వస్తుంది. వీటిని కేంద్రం అన్ని రాష్ట్రాలకు కేటాయిస్తుంది. కేరళకు ఇవ్వాల్సిన 13 వేల కోట్ల రూపాయలను ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే అదనంగా మరో 15 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేదని కేంద్ర ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దీంతో ఇరువురి మధ్య వివాదం నెలకొనగా కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.