సత్యేంద్ర జైన్ కు బెయిల్
Bail to Satyendra Jain
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సత్యేంద్ర జైన్ కు ఊరట లభించింది. శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టు మాజీ మంత్రికి బెయిల్ ఇచ్చింది. పలు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. విచారణలో జోక్యం, సాక్షులతో మాట్లాడొద్దని, కోర్టుకు తెలియకుండా విదేశాలకు వెళ్లరాదని పలు షరతులు విధించింది. బెయిల్ విషయం తెలుసుకున్న సత్యేంద్ర జైన్ భార్య సంతోషం వ్యక్తం చేసింది. 2022 మే 30న ఈడీ అవినీతి ఆరోపణలపై సత్యంద్ర జైన్ ను అరెస్టు చేసింది.