ప్రధాని మోదీ అధ్యక్షతన 14,15న నాలుగో సహకార సమాఖ్య సమావేశం
Fourth Co-operative Federation Conference on 14,15
హాజరు కానున్న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సాంకేతిక నిపుణులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య బలోపేతం చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో డిసెంబర్ 14, 15 తేదీల్లో న్యూ ఢిల్లీలో జరగనున్న నాలుగో జాతీయ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. శుక్రవారం పీఎంవో కార్యాలయం వివరాలను వెల్లడించింది. తొలిసమావేశం 2022 ధర్మశాలలో, 2023జనవరి, డిసెంబర్ లో రెండు, మూడో సమావేశాలు న్యూ ఢిల్లీలో నిర్వహించారు. తాజాగా నాలుగో సమావేశాన్ని దేశరాజధానిలో నిర్వహించనున్నారు. అభివృద్ధి ఏజెండా, వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికపై దృష్టి పెట్టనున్నారు. పట్టణ, గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలపై చర్చిస్తారు. తయారీ, సేవలు, వ్యవసాయం, ఉపాధి, పునరుత్పాదక ఇంధనం, ఆర్థిక రంగాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఉత్తమ పద్ధతులు, వ్యూహాలను పంచుకోనున్నారు. ఈ సమావేశంలో పీఎం సూర్యఘర్, మిషన్ కర్మయోగి, వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ జ్ఞాన పరంపర వంటి ముఖ్యాంశాలపై కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోనుంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు పాల్గొంటారని ప్రకటనలో వివరించారు.