ఐపీఎస్​ కూతురు అనుమానాస్పద మృతి

Suspicious death of IPS daughter

Sep 1, 2024 - 20:08
 0
ఐపీఎస్​ కూతురు అనుమానాస్పద మృతి

రామ్​ మనోహర్​ లోహియా నేషనల్​ లా యూనివర్సిటీలో ఘటన
పోస్టుమార్టం నివేదికలో నిజాలు తెలుస్తాయన్న పోలీసులు
పెద్ద యెత్తున ఆందోళనకు దిగిన యూనివర్సిటీ విద్యార్థులు

లక్నో: లక్నో రామ్​ మనోహర్​ లోహియా నేషనల్​ లా యూనివర్సిటీ హాస్టల్​ లో 19 యేళ్ల విద్యార్థిని మృతి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఎల్​ ఎల్​ బీ మూడో సంవత్సరం చదువుతున్న అనికా రస్తోగి (19) మృతదేహం తన గదిలో లభించింది. ఈ విద్యార్థిని తండ్రి ఎన్​ ఐఏ అధికారిగా తెలుస్తోంది. ఐజీగా పనిచేస్తున్న ఐపీఎస్​ సంతోష్​ రస్తోగి కుమార్తెనే అనికా రస్తోగి. శనివారం రాత్రి హాస్టల్​ లోని తన గదిలోకి వెళ్లిన అనికా అనంతరం తలుపులు తీయలేదని హాస్టల్​ లోని వారు చెబుతున్నారు. అపస్మారక స్థితిలో హాస్టల్​ లో కింద పడి ఉండగా అర్థరాత్రి గమనించి ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థిని మృతికి ఇంకా కారణాలు తెలియరాలేదని అషియానా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపామన్నారు. రిపోర్టు వస్తే గానీ అసలు కారణాలు తెలుస్తాయన్నారు. కాగా విద్యార్థిని మృతి పట్ల తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు. ఒకదశలో పోలీసులు విద్యార్థులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై కూడా విద్యార్థులు దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు వెంటనే అదనపు బలగాలను రంగంలోకి దింపి భారీ ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు.