‘హస్తం’పై పినరయి నిప్పులు

మేనిఫెస్టోలో సీఏఏ ప్రస్తావన లేకపోవడంపై ఆగ్రహం

Apr 6, 2024 - 20:00
 0
‘హస్తం’పై పినరయి నిప్పులు

తిరువనంతపురం: కేరళ సీపీఎం పార్టీ సీఎం పినరయి విజయ్​కాంగ్రెస్​పై నిప్పులు గక్కారు. సీఏఏ ప్రస్తావన మేనిఫెస్టోలో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సీఎం పినరయి విజయన్​ తిరువనంతపురం  అలప్పుజాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ హస్తంపై విమర్శలు చేశారు. సీఏఏపై కాంగ్రెస్​ మౌనం వహించడం నేరంతో సమానమని పేర్కొన్నారు. ఆర్​ఎస్​ఎస్​ విసురుతున్న సవాళ్లను హస్తం సీరియస్​గా ఎందుకు తీసుకోవడం లేదన్నారు. తమ పార్టీ మేనిఫెస్టోలో సీఏఏ రద్దు చేస్తామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. గత ఐదేళ్ల అనుభవంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రయోజనం లేదని ప్రజలు అర్థం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పార్లమెంట్ లోపల, బయట నిరసనలు తెలపడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. ఇదిలా ఉంటే, సీఏఏకి వ్యతిరేకంగా పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, కూటమి నేతల తీరు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా కొనసాగుతోంది. ఎక్కడ ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారు? వ్యతిరేకిస్తారు? ఎవరు రంగంలోకి దిగుతున్నారు? ఎవరు ప్రచారం చేస్తున్నారు? ఎవరు ప్రచారాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారనే విషయాలు తెలియక ఓ వైపు కాంగ్రెస్ మరోవైపు కూటమి పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలాగే కొనసాగితే కాంగ్రెస్, కూటమి కొంపలు మునగడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.