ఉత్పత్తి పెంపు సాధ్యసాధ్యాలపై అధికారులతో మంత్రి కిషన్​ రెడ్డి భేటీ

Minister Kishan Reddy met with officials on the possibilities of increasing production

Jun 25, 2024 - 16:44
 0
ఉత్పత్తి పెంపు సాధ్యసాధ్యాలపై అధికారులతో మంత్రి కిషన్​ రెడ్డి భేటీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బొగ్గు, గనుల్లో ఉత్పత్తి పెంపు సాధ్యసాధ్యాలు, వాస్తవిక పరిస్థితులపై ఆ శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని కేంద్ర బొగ్గు, గనుల శాఖ కార్యాలయం శాస్త్రి భవన్‌ లో అధికారులతో మంత్రి కిషన్​ రెడ్డి సమవేశం అయ్యారు. దేశంలో నిర్వహిస్తున్న వివిధ ప్రాజెక్టుల తీరు, పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. చేపట్టాల్సిన పనులపై అధికారులతో సమీక్షించారు. పూర్తి ప్రణాళికల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న పనులపై ఆరా తీశారు. తెలంగాణలోని ప్రాజెక్టులపై కూడా మంత్రి జి.కిషన్​ రెడ్డి అధికారులతో సమీక్షించారు.