ఫ్లోటింగ్ అణు విద్యుత్ కేంద్రం
భారత భవిష్యత్ లో కీలకం
- తొలిసారిగా కదలాడే విద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిధుల కేటాయింపు
- రష్యా, ప్రైవేట్ సంస్థల సహాకారంతో రూపకల్పన
- సఫలీకృతం అయితే మూడోదేశంగా నిలవనున్న భారత్
- పర్యావరణానికి మేలు
- కేంద్రం ప్రధాని మోదీ ఆలోచనపై పలు దేశాల చూపు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: భారత్ లో మొబైల్ అణు కర్మాగారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ లో ప్రకటనతో ప్రపంచదేశాల దృష్టి భారత్ పై పడింది. అసలు ఈ మొబైల్ అణు కర్మాగారం అంటే ఏంటీ? దీన్ని ఎందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఎంత ఖర్చు చేయనుంది. ఎప్పటికి సిద్ధం కానుందనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుందాం.
మొబైల్ అణు కర్మాగారం ఏర్పాటు అనేది ఇదే మొదలు కాదు. తొలుత ఈ కర్మాగారాన్ని రష్యా రూపొందించింది. దీని ద్వారా భారీ ఎత్తున విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకు రూ. 3వేల కోట్ల నుంచి రూ. 25వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. దీని రూపకల్పనకు అత్యంత అనుభవం కలిగిన అణు శాస్ర్తవేత్తలు అవసరం అవుతారు. రష్యాలోని పెవెక్ నగర సముద్ర తీరంలో తేలియాడే అణు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆ నగరానికి కావాల్సిన మొత్తం విద్యుత్ అవసరాలను తీరుస్తోంది.
అభివృద్ధి చెందుతున్న భారత్ లో తేలియాడే అణు విద్యుత్ కేంద్రం అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. దీని రూపకల్పనకు రష్యా సహకారం కూడా తీసుకోనుంది. దీని ద్వారా దేశంలోని విద్యుత్ అవసరాలను తీర్చుకోనుంది. చిన్న నుంచి పెద్ద మాడ్యూలర్ రియాక్టర్ల నిర్మాణానికి ప్రైవేట్ సంస్థలతో కలిసి భారత్ పని చేయనుంది. అణుశక్తి రంగంలో పరిశోధనకు, అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది.
అణు విద్యుత్ రూపకల్పనను మూడు విభాగాలకు ప్రభుత్వం విభజించింది. సూక్ష్మ రియాక్టర్, చిన్న మాడ్యులర్ రియాక్టర్, సాధారణ అణు రియాక్టర్.వీటి రూపకల్పనతో దేశంలోని ఏ ప్రాంతంలోని విద్యుత్ అవసరాలను అయినా తీర్చేందుకు వీలు కలుగుతుంది.
ఇప్పటివరకు రష్యా, చైనాలు మాత్రమే ఈ విధమైన ఫ్లోటింగ్ అణు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. భారత్ మూడో దేశంగా నిలవనుంది. రష్యా 300 మెగావాట్ల విద్యుత్, చైనా 210 మెగావాట్ల ఉత్పత్తిని సాధిస్తున్నాయి. ఇవే గాక అర్జెంటీనా, దక్షిణ కొరియా, అమెరికాలు కూడా ఈ రకమైన అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నాయి.
అయితే భారత్ లో నిర్మించే ఫ్లోటింగ్ అణు విద్యుత్ కేంద్రానికి అయ్యే ఖర్చు అణు రియాక్టర్ కంటే 8 రెట్లు తక్కువగా ఉండనుండడంతో భారత్ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. సముద్ర తీర ప్రాంతాల్లో ఈ విద్యుత్ కేంద్రాన్ని మోహరించి ఆ ప్రాంతానికి నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేయొచ్చు. భారత్ లోని పలు సముద్ర తీర ప్రాంతాలైన ద్వీపాలలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. దీన్ని తీర్చేందుకు ఈ ఫ్లోటింగ్ అణు విద్యుత్ కేంద్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి.
ఇప్పటివరకు భారత్ లో బొగ్గు, నీరు, సౌరశక్తి, పవనశక్తి ద్వారానే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఫ్లోటింగ్ అణువిద్యుత్ కేంద్రం ఆలోచనలో భారత్ సఫలీకృతమైతే గణనీయమైన అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. దేశ అవసరాలను ఈ విద్యుత్ కేంద్రం ద్వారా తీర్చుకోవడంతోపాటు, ఇతర ప్రాంతాలకు మనకున్న వనరుల ద్వారా విద్యుత్ ను అందజేసే అవకాశం ఉంది.
మరోవైపు పాత పద్దతుల ద్వారా విద్యుత్ ఉత్పత్తితో పర్యావరణానికి ఎక్కువ హాని కలుగుతోంది. అణు విద్యుత్ తో పర్యావరణానికి హానీ కలిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అణు విద్యుత్ వైపు మొగ్గు చూపుతోంది.