చంద్రుడిపై నమూనాల సేకరణకు లూనార్​ మిషన్​ ప్రయోగించిన చైనా

ధూళి, రాళ్లపై పరిశోధన

May 3, 2024 - 18:43
 0
చంద్రుడిపై నమూనాల సేకరణకు లూనార్​ మిషన్​ ప్రయోగించిన చైనా

బీజింగ్​: చంద్రుని నమూనాలను సేకరించి పరిశోధించేందుకు చైనా సిద్ధమైంది. శుక్రవారం చంద్రునిపైకి వెళ్లేందుకు లూనార్ ప్రోబ్ మిషన్‌ను  ప్రారంభించింది. చాంగ్ ఈ-6 అని ఈ మిషన్​ కు చైనా పేరు పెట్టింది. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్​ఎస్​ఏ) ప్రకారం, చాంగ్​ –6 మిషన్ కింద చంద్రుని వైపు నుంచి నమూనాలను సేకరించనున్నారు. దీని తరువాత, ఈ నమూనాలను భూమికి తీసుకువచ్చి వాటిపై పరిశోధనలు చేయనున్నారు. ధూళి, రాళ్ల నమునాలను సేకరించి పరిశోధించాలనే ఈ ప్రయోగ ముఖ్య ఉద్దేశం. 

చంద్రుడి అన్వేషణలో చైనా చేపట్టిన ఈ ప్రయోగం మొదటి ప్రయోగంగా ప్రయత్నంగా శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. లాంగ్ మార్చ్-5 వై–8 రాకెట్ ద్వారా చాంగ్'ఈ-6ని చంద్రుడిపైకి పంపారు. హైనాన్ ప్రావిన్స్‌లోని వెన్‌చాంగ్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి దీనిని ప్రయోగించారు.