అజ్మీర్ లో గూడ్స్ కు తప్పిన ప్రమాదం
పట్టాలపై సిమెంట్ దిమ్మెలు
లోక్ పెలెట్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం
కేసు నమోదు దర్యాప్తు
కాన్పూర్ లో రైల్వే ట్రాక్ పై సిలీండర్ లో ఉగ్రకోణం
జైపూర్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పేందుకు మరో ప్రయత్నం విఫలమైంది. గుర్తు తెలియని వ్యక్తులు రైలు ట్రాక్ పై 70కిలోల బరువున్న సిమెంట్ దిమ్మెలను ఉంచాను. ఈ దిమ్మెలను గూడ్స్ రైల్ ఢీకొట్టినప్పటికీ ప్రమాద ముప్పును తప్పించడంలో లోకోపైలెట్ కీలకం వ్యవహరించాడు. ఈ విషయాన్ని అధికారులకు సమాచారం అందజేశారు. ఫూలేరా –అహ్మాదాబాద్ స్ట్రెచ్‌లోని శారధ్నా – బంగాడ్ స్టేషన్‌ల మధ్య సోమవారం అర్థరాత్రి ఈ సంఘటన జరిగింది. లోకోపైలెట్ ద్వారా వివరాలు తెలుసుకున్న అధికారులు హుటీహుటీన ఆ ప్రాంతానికి చేరుకొని ఇది విద్రోహ చర్యగా తేల్చారు. అంతేగాక కొద్దిదూరం వెళ్లాక పట్టాలపై మరో దిమ్మెను గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్, రైల్వే పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభంచారు.
దూరం నుంచే ట్రాక్ పై దిమ్మెను పసిగట్టిన లోకోపైలెట్ స్పీడ్ ను తగ్గించాడు. అయినా దిమ్మెపై నుంచి ట్రైన్ వెళ్లినా పెద్ద ప్రమాదం చోటు చేసుకోలేదు. వెంటనే అధికారులకు సమచారం అందజేశాడు. దీంతో అన్ని రైల్వే ట్రాక్ లపై భద్రతను పెంచారు. కాగా అజ్మీర్ లో అధికారులు ఈ గూడ్స్ రైలు పూర్తి సురక్షితంగా పట్టాలపైనే ఉండడంతో తిరిగి ప్రయాణించేలా చర్యలు తీసుకున్నారు.
సెప్టెంబర్ 8న కాన్పూర్ లో కూడా ఇలాంటి విద్రోహకర చర్య జరిగింది. భివానీ–ప్రయాగ్ రాజ్ మధ్య రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన అధికారులు, ఇంటలిజెన్స్ బృందాలు ఇందులో ఉగ్రకోణం ఉందని అనుమానిస్తున్నారు. కాళింది ఎక్స్ ప్రెస్ 14117 పట్టాలపై సిలిండర్లు, పెట్రోల్ ను దుండగులు పెట్టారు. రాడికల్ ఉగ్రవాద కోణం ఉందని ఖొరాసన్ మాడ్యూల్ లింక్ ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ సంస్థ ఐసిస్ కు చెందినది. వీరు సామాజిక మాధ్యమాలు, సోషల్ ఖాతాల ద్వారా పలువురు యువకుల మదిలో విషాన్ని నింపి దాడులను, హింసను ప్రేరేపించేందుకు కారణమవుతారు. ఇప్పటికే ఈ కోణంలో విచారించిన అధికారులు 12 మందిని అదుపులోకి కూడా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ రకమైన మెటీరియల్ ద్వారా పాక్ లో కూర్చొని ఐఎస్ ఐఎస్ కమాండర్ ఫర్తుల్లా ఘోరీ ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు. ఇతని ఆడియో క్లిప్ ను కూడా విశ్లేషించారు. ఇందులో భారత్ రైల్వే నెట్ వర్క్ పై దాడులు చేయాలని ఫర్తుల్లా పిలుపునిచ్చాడు. 219 కెమెరాల ఫుటేజీని సేకరించిన దర్యాప్తు సంస్థలు వందమందిని విచారించారు. మూడు సిలీండర్ ఏజెన్సీలను విచారిస్తున్నారు. నిందితులు సిలీండర్లు, పెట్రోల్ పెట్టాక అక్కడే సమీపాన పొదల్లో నక్కి ఉన్నట్లు గుర్తించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా వారికి చెందిన పలు రకాల ఆధారాలను కూడా సేకరించారు.