బాణా సంచా కాల్చడం.. పోలీసులపై సుప్రీం ఫైర్
Firing firecrackers.. Supreme fire on police
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బాణాసంచాపై నిషేధం ఉన్నా, వాటిని కాల్చడంపై ఢిల్లీ పోలీసులు ఎం చర్యలు తీసుకున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్య్తక్తం చేసింది. సోమవారం బాణా సంచా నిషేధానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్త అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను సుప్రీం కోర్టు ఆదేశించింది. బాణాసంచా కాలుష్య నివారణపై ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. లైసెన్స్ లేకుండా ఎవరూ బాణాసంచా ఉత్పత్తి చేయరాదని, విక్రయించకూడదని కోర్టు ఆదేశించింది. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యలను ఏ మతమూ ప్రోత్సహించదని సుప్రీం పేర్కొంది. టపాసులను పేల్చడంతో ఉత్పత్తి అయ్యే కాలుష్యం వల్ల పౌరుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఇది ప్రాథమిక హక్కు ఉల్లంఘన కిందకు వస్తుందని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. నవంబర్ 25 లోపు బాణాసంచా శాశ్వత నిషేధం విధించడంపై నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోర్టు సూచించింది.