పొరుగుదేశంతో బంధాలు నిబద్ధతో భారత్ ముందడుగు
శ్రీలంక అధ్యక్షుడితో మంత్రి జై శంకర్ భేటీ
కొలంబో: పొరుగుదేశంలో బలమైన సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత్ నిబద్ధతతో ఉందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. శుక్రవారం శ్రీలంక పర్యటన సందర్భంగా జై శంకర్ అధ్యక్షుడు దిసా నాయక్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జై శంకర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూలు పొరుగుదేశాలతో సత్సంబంధాలకు అధిక ప్రాధాన్యతనిస్తారని తెలిపారు. వీరిద్దరి తరఫున అధ్యక్షుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం కొనసాగుతున్న సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేదిశగా అధ్యక్షుడితో చర్చలు జరిగాయన్నారు. సంక్షేమాన్ని, సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలసిన ఆవశ్యకత ఉందని తెలిపానన్నారు. ఉదయం విదేశాంగ మంత్రి విజితా హెరాత్ తో కూడా మంత్రి జై శంకర్ సమావేశం నిర్వహించారు. భాగస్వామ్య ప్రయోజనాలపై చర్చించారు.