దోడాలో ఎన్ కౌంటర్ ఆర్మీ చీఫ్ వీరమరణం
నలుగురు ఉగ్రవాదులు హతం? కొనసాగుతున్న ఎన్ కౌంటర్ ఎం–4 రైఫిల్, పేలుడు పదార్థాలు స్వాధీనం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ దోడాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ ఆర్మీ కెప్టెన్ దీపక్ వీరమరణం పొందాడు. భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతిచెందినట్లుగా సమాచారం తెలిసినా అధికారులు ఇంకా ధృవీకరించలేదు.దోడాలోని పట్నితోప్ అడవుల్లో ఉగ్రవాదులతో ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి బీకర ఎన్ కౌంటర్ సాగుతోంది. ఉగ్రవాదుల నుంచి సైన్యం ఎం4 రైఫిల్, పేలుడు పదార్థాల బ్యాగును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోందని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు అధికారులు ప్రకటించారు. సైనికులకు అటవీ ప్రాంతంలో కూంబింగ్ కు సూచనలిస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుంచి అతన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. అకార్ నదీ తీరంలో ఉగ్రవాదులు నక్కి కాల్పులకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.