గుజరాత్​ తీరంలో 14మంది పాక్​ జాతీయుల అరెస్ట్​

86 కిలోల డ్రగ్స్​ స్వాధీనం ఎన్​ సీబీ–ఏటీఎస్​, కోస్ట్​ గార్డ్​ సంయుక్తం ఆపరేషన్​

Apr 28, 2024 - 17:06
 0
గుజరాత్​ తీరంలో 14మంది పాక్​ జాతీయుల అరెస్ట్​

గాంధీనగర్​: గుజరాత్​ తీరంలోని ఎన్​ సీబీ–ఏటీఎస్​, కోస్ట్​ గార్డ్​ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఆపరేషన్​ లో సముద్రంలో 14 మంది పాక్​ జాతీయులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 86 కిలోల డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్​ కు సంబంధించి సమాచారం కొద్ది రోజుల క్రితమే అందిందన్నారు. గోప్యత పాటించామని తెలిపారు. నిఘా పెంచామన్నారు. పాక్​ జాతీయులపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఐసీజీ షిప్ రాజ్‌రతన్‌లో అనుమానాస్పద బోటును గుర్తించారు. రాజ్‌రతన్ షిప్‌లోని నిపుణుల బృందం పాకిస్థాన్ బోట్‌లోకి దిగింది. తదుపరి విచారణ కోసం పడవను పోర్‌బందర్‌కు తీసుకువస్తున్నామని అధికారులు వివరించారు. అయితే అధికారుల వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్​ నిర్వహించినట్లు వెల్లడించారు.