గిరిజన మహిళపై దాడి  బీజేపీ మహిళా మోర్చా నిరసన

Attack on tribal woman BJP Mahila Morcha protest

Sep 6, 2024 - 17:52
 0
గిరిజన మహిళపై దాడి  బీజేపీ మహిళా మోర్చా నిరసన

నా తెలంగాణ, నిర్మల్: జైనూరులో గిరిజన మహిళపై జరిగిన అత్యాచార ఘటనపై విచారణ చేపట్టి కఠిన శిక్ష  విధించాలని శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రజిని వైద్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ హత్యాయత్నానికి పాల్పడిన మాగ్ధుమ్​ ను కఠినంగా శిక్షించి ఉరితీయాలని డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. బాధితురాలికి సరైన వైద్యం అందించాలని మహిళా మోర్చా నిర్మల్ జిల్లా డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అలివేలు మంగ, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సామ భూలక్ష్మి, పట్టణ అధ్యక్షులు ఆడెపు లలిత, సభ్యత్వ నమోదు జిల్లా కోకన్వీనర్ సుష్మా రెడ్డి, జిల్లా కార్యదర్శి లత, అంబేకర్ దీప, సుజాత, సారిక జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.