రైతులకు అందుబాటు ధరలో ఎరువులు

Fertilizers at affordable prices for farmers

Dec 6, 2024 - 18:20
 0
రైతులకు అందుబాటు ధరలో ఎరువులు

2023–24లో కేంద్రం సబ్సిడీ రూ. 65వేల కోట్లు
మార్కెట్​ లో డీఎపీ బస్తా ధర రూ. 3,100
రైతులకు రూ. 1,350లకే  లభ్యం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రైతులకు సరసమైన ధరలకే ఎరువులు అందించేందుకు 2023–24లో కేంద్ర ప్రభుత్వం రూ 65,000 కోట్లను సబ్సిడీ అందించిందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్​ అన్నారు. శుక్రవారం పార్లమెంట్​ లో ఫాస్ఫేటిక్​, పొటాసిక్​ ఎరువులపై ప్రసంగించారు. డీఎపీ బస్తాకు రూ. 3,100 ధర ఉండగా, రైతులకు రూ. 1,350లకే అందజేస్తున్నట్లు తెలిపారు. మిగతా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ కింద భరిస్తుందన్నారు. 2022–23లో ఈ పథకం కింద రూ. 83వేల కోట్లను అందించామన్నారు. 2024–25లో రబీ సీజ్​ లో డీఎపీ 35 లక్షల టన్నులకు పైగా అవసరం ఉందని, లభ్యత 37 లక్షల టన్నులుగా ఉందన్నారు. డిసెంబర్​ 2 వరకు వినియోగం 28 లక్షల టన్నులకు పైగా ఉందని మంత్రి తెలిపారు. ఎరువులపై 1 అక్టోబర్ 2024 నుంచి 2025 మార్చి 31 వరకు రబీ సీజన్ 2024కి పోషకాల ఆధారిత సబ్సిడీ, ఎన్​ బీఎస్​ రేట్లను నిర్ణయించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 రబీ సీజన్​ కే   రూ. 24వేల కోట్లను కేటాయించినట్లు తెలిపారు.