టూరిజం, ఆసుపత్రి రంగాల్లో 61 లక్షల ఉద్యోగాలు

61 lakh jobs in tourism and hospital sectors

Dec 18, 2024 - 16:40
 0
టూరిజం, ఆసుపత్రి రంగాల్లో 61 లక్షల ఉద్యోగాలు

సీఐఐ 18వ వార్షికోత్సవంలో నివేదిక వెల్లడి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2036–37 నాటికి టూరిజం, హాస్పిటాలిటీ రంగంలో 61 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని కాన్ఫడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ ఇండస్ర్టీ (సీఐఐ) స్పష్టం చేసింది. బుధవారం సీఐఐ 18వ టూరిజం వార్షికోత్సవంలో ‘ఎంప్లాయ్‌మెంట్ ల్యాండ్‌స్కేప్ ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ’ పేరుతో నివేదికను ఆవిష్కరించారు. నివేదిక ప్రకారం రంగాల్లో గణనీయ విస్తరణ జరుగుతుంది. దీంతో ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పన పెరుగుతుంది. 46 లక్షల మంది పురుషులు, 15 లక్షల మంది మహిళలు ఈ రంగాల విస్తరణకు అవసరం అవుతారు. ప్రస్తుతం భారత్​ ప్రపంచంలో ఉపాధి, పర్యాటకం, ఆతిథ్య రంగాల్లో 8 శాతం వాటాను కలిగి ఉంది. కోవిడ్​ కారణంగా ఎదురు దెబ్బలు తగిలినా భారత్​ పుంజుకుంది. ఇది దేశీయ పరిశ్రమ, ఆర్థిక, టూరిజం, హాస్పిటాలిటీ రంగాలలో వృద్ధిని కనబరుస్తుంది. వృద్ధి సాధన జీడీపీ బలపడేందుకు తోడ్పడుతుంది. 2021లో ఎకనామిక్​ ఫోరమ్​ ప్రకారం 54వ స్థానంలో ఉన్న భారత్​ 2024లో 39వ స్థానానికి చేరిందని సీఐఐ నివేదిక స్పష్టం చేసింది. అంతేగాక భవిష్యత్​ లో భారత్​ నివేదికలో సూచించిన చర్యలను తీసుకుంటే మరింత వృద్ధి, ఉపాధి సాధ్యమవుతుందని పేర్కొంది.