జై శ్రీరామ్ అన్నందుకు దాడి
Attacked for saying Jai Sriram
కోల్ కతాలో బీజేపీ నేత బిస్వజిత్ ఆవేదన
ఇంట్లోకి చొరబడి విగ్రహాలు ధ్వంసం
సలాం అలెకుమ్ కు ప్రతిగా జై శ్రీరామ్ అన్నందుకే దాడి చేశారన్న బాధితుడు
దాడిచేసిన వారంతా రోహింగ్యా, బంగ్లాదేశ్ ముస్లిం మూకలే
కోల్ కతా: సలామ్ వాలేకుమ్ కు ప్రతిగా జై శ్రీరామ్ అన్నందుకు రోహింగ్యా, బంగ్లాదేశ్ ముస్లిం మూకలు హిందూ వ్యక్తిగా మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. బాధితుడు ఇందుకు సంబంధించిన పూర్వపరాలను కుటుంబీకుల సహాయంతో ఎక్స్ లో పోస్ట్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ వీడియో పశ్చిమ బెంగాల్ ది కావడం గమనార్హం. బాధితుడు బీజేపీకి చెందిన బిస్వజిత్ మండల్.
ఆగస్ట్ 13న రాత్రి 9 గంటల ప్రాంతంలో బిస్వజిత్ ఉండే నిమ్తా ఐక్ పారాలోని ఇంటికి ఒక వృద్ధ ముస్లిం వచ్చి సలా అలైకుమ్’ అని పలకరించాడు. ఇందుకు ప్రతీగా బిస్వజిత్ జై శ్రీరామ్ అన్నాడు. అంతే ఆ వ్యక్తితో ఆ వృద్ధుడు గలాటకు దిగాడు. వెంటనే తన సమూహాన్ని రప్పించి అతనిపై దాడికి పాల్పడ్డాడు. వీరంతా 150 నుంచి 200మంది వరకు ఉన్నారని బాధితుడు వాపోయాడు. తాను చెప్పింది వినిపించుకోకుండా దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంత వేడుకున్నా విడిచిపెట్టలేదన్నారు. స్థానికులు గుమిగూడటంతో వారు వెళ్లిపోయారని అన్నాడు. దాడికి పాల్పడినవారంతా రోహింగ్యా, బంగ్లాదేశ్ ముస్లింలని బిస్వజిత్ తెలిపాడు.
అంతేగాకుండా ఇంట్లోకి జొరబడి తలుపులు, సామాన్లను చిందరవందర చేశారని, హనుమంతుని విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారని వాపోయాడు. మహిళ అని చూడకుండా అడ్డువచ్చిన తన భార్యపై కూడా దాడికి పాల్పడ్డారని వాపోయాడు. మీరు జీవించి ఉండాలంటే వెంటనే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించారని ఆవేదన వ్యక్తం చేశాడు.